
విభజనకు అంగీకరిస్తే అభ్యంతరాలపై చర్చిద్దాం
– టీ నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు గురువారం సమావేశమై దీనిపై చర్చించారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంబనకు ఎలా తెర తెరదించాలి? రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్తితులను ఏవిధంగా తొలగించాలి? విభజనపై రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం ఏమిటి? వంటి అంశాలపై చర్చించారు. మరోమారు సమావేశమై అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ఉద్దేశంతో సీఎల్పీ కార్యాలయంలో ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మహమ్మద్ జానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై నెలకొన్న ప్రతిష్టంబనకు తెర దించేందుకు నేపథ్యంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ ప్రకటన, తదనంతరం తలెత్తిన పరిస్థితులపై ఇరు ప్రాంతాల నాయకులు చర్చించారు.
తొలుత జానారెడ్డితో ఎమ్మెల్సీలు పొంగులేటి, పద్మరాజు, జానీ భేటీ అయ్యారు. అనంతరం సీమాంద్ర మంత్రులు గంటా, ఏరాసు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఏర్పాటు వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అన్నదానిపై చర్చ జరిగింది. రాష్ట్ర విభజనపై ఏయే అంశాలలో ఇబ్బందులు ఉన్నాయి.. ఎందుకు సీమాంద్రలో అంత వ్యతిరేకత వస్తోంది.. ఆదాయ వనరుల పంపిణీ వంటి అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ఈ సందర్భంగా కొన్ని నిర్దిష్టప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం మంత్రి జానారెడ్డి, పొంగులేటి.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ-సీమాంధ్ర ప్రాంత నేతల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను, ప్రతిపాదనలను కిరణ్‌కు వివరించారు.
విభజనకు సహకరించండి:టీ-మంత్రులు
తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు సహకరించాలని తెలంగాణ మంత్రులు కోరారు. ఇరు ప్రాంతాల భేటీ ముగిసిన అనంతరం తెలంగాణ నేతలతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు విూడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాల నేతల మధ్య సద్భావన కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరామని శ్రీధర్‌బాబు చెప్పారు. అధినేత్రి సోనియాగాంధీపై విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఉమ్మడిగా వ్యతిరేకించాలని నిర్ణయించామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు.
చర్చలు విఫలం: సీమాంధ్ర మంత్రులు
ఇరు ప్రాంతాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సమైక్యానికి వేరే ప్రత్యామ్నయమేవిూ లేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో నాయకులు చెబితే ఉద్యమం నడిచే పరిస్థితి లేదని, ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని తెలంగాణ ప్రాంత నేతలకు తెలిపామన్నారు. అక్కడ జరుగుతున్న ఉద్యమంపై వారికి వివరించామని చెప్పారు. విభజనపై తమ అభ్యంతరాలు చెప్పాలని టీ-నేతలు కోరారని.. అయితే, సమైక్యం తప్ప మరో పరిష్కారం లేదని చెప్పామన్నారు. ¬ం మంత్రి షిండే ప్రకటనను సీరియస్‌గా తీసుకోవాల్సిందేనన్నారు. విభజన జరిగితే సీమకు తీవ్ర నష్టమని టీ-నేతలకు వివరించినట్లు ఏరాసు తెలిపారు. కలిసుండి నష్టాలను పరిష్కరించుకుందామని వారిని కోరామన్నారు. గతంలో జరిగిన నష్టాలను ఇప్పుడు పరిష్కరించుకుందామని, విభజన మాత్రం వద్దని చెప్పామని తెలిపారు.




