మానవాళి అభివృద్ధికి కీలకం పరిశోధనలే

హైదరాబాద్‌: ఆధునిక కాలంలో మానవాళి మనుగడకు పరిశోధనలే కీలకమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హెచ్‌సీయూలో ఇవాళ జరిగిన డాక్టర్‌ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసంలో ‘ఇన్సులిన్‌ నిరోధక శక్తి-కొత్త రకం మధుమేహ వ్యాధులు’ లనే అంశం పై ఆయన ప్రసంగించారు. ఔషధ, పరిశోధన రంగంలో భారత్‌ ఎదుర్కోంటున్న సవాళ్లపైనా ఆయన మాట్లడారు. ప్రపంచ దేశాల్లో అధిక పెట్టుబడులు పరిశోధనల పైనే జరుగుతుండగా మన దేశంలో అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదని చెప్పారు. ఔషద సంబంధిత ఆవిష్కరణలకు శాస్త్ర, సాంకేతిక శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామి ఇచ్చారు.

తాజావార్తలు