నిజాం కళాశాల మైదానాన్ని పరిశీలించిన టీజేఏసీ నేతలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 : తెలంగాణ రాజకీయ జేఏసీ నేతృత్వంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న సకలజన భేరి సభ స్థలిని జేఏసీ చైర్మన్‌ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌, అద్దెంకి దయాకర్‌, రఘు తదితరులు శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మైదానంలోని అన్ని ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, సదస్సుకు అనుమతి లభించిందని, తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై సీడబ్ల్యుసీ తీర్మానం నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం వెనక్కిపోతే అందుకు బాధ్యత ఈ ప్రాంత మంత్రులదేనని చెప్పారు. సీమాంధ్ర మంత్రులంతా ఒక్కతాటిపై నిలబడి అధిష్టానంపై ఒత్తిడి పెంచుతుంటే తెలంగాణ మంత్రులు నిద్రపోతున్నారని విమర్శించారు. ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజావార్తలు