తెలుగుజాతి అంటే అహంకారపూరిత ఆధిపత్యం

తెలంగాణ రాజ్యాంగబద్ధమైన డిమాండ్
అక్రమ సంపద పునర్నిర్మాణంలో పంపిణీ కావాలి
గోవా లోకాయుక్త జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి
కరీంనగర్, సెప్టెంబర్ 22 (జనంసాక్షి) :
తెలుగు జాతి అంటేనే అహంకారపూరిత ఆధిపత్యమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, గోవా లోకాయుక్త జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఇంది రాగార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాజ్యాంగబద్ధమైన డిమాండ్ అని పేర్కొన్నారు. రాజకీయ, ప్రభుత్వ అండతో కూడబెట్టుకున్న అక్రమ సంపద తెలంగాణ పునర్నిర్మాణంలో పంపిణీ కావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభ దశలో వుంది దీనిని అడ్డుకోవడానికి జరిగే ప్రయత్నం రాజ్యాంగ వ్యతిరేకం, ద్రోహం రాజ్యాంగం భష్ట్రు పట్టించకుండా అవరో ధాలు కల్పించకుండా చర్చలతో మిగతా సమస్యలను పరిష్క రించుకుందామని అన్నారు. ఆర్టికల్ 3కు అడ్డుపడి మహా భారత యుద్ధం మళ్లీ కోరవద్దని శాంతియుతంగా సహజీవనం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజన అంటే భౌ గోళిక గీతలు గీయడం కాదని అరువై ఏళ్లుగా భూమి పుత్రు లకు జరిగిన అన్యాయాల లెక్కలు తేలాలని చెప్పారు. హైదరా బాద్ చుట్టు పర్యావరణం దెబ్బతిన్నదని 440 చెరువులు, కుంటలు దురాక్రమణ చేశారని వాటి లెక్కలు తేలాని అన్నారు. వక్ఫ్ భూముల లెక్కలు దేవాలయ భూముల లెక్కలు తేల్చాలని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంతార్భాగంలో అంటున్న మాటలు మాత్రమేనని ప్రతికారేచ్చతో చెప్పడంలేదని వీటిపై ఆలోచనలు రేకెత్తేలాంటి రచనలు చేయాలని కోరారు. తెలం గాణ రచయితలు సోక్రటీస్ కాళోజీ వారసులని, రాజ్యాన్ని వారు ప్రశ్నించడమే కాదు, ప్రజలకూ రాజ్యాన్ని ప్రశ్నించే హక్కు వుందని నేర్పారని అందుకే మీరు ఆ ఇద్దరు మహనీ యుల వారసులని సగర్వంగా చెబుతున్నాని చెప్పారు. సోక్రటీస్ వారసులు 20వ శతాబ్దంలో ఐస్టీన్, గాంధీ, లోహియా, జయప్రకాశ్‌నారాయణ, కాళోజీలను ఆయన కీర్తించారు. సోక్రటీసు వలే కాళోజీ చివరి శ్వాస వరకు ప్రశ్నించిన వ్యక్తి ఆయన వారసులుగా తెలంగాణ కవులు రచయితలు గొంతు విప్పాలని కోరారు. తెలుగుజాతి పదబంధం నుంచి పదం నుంచి విడిపోదామని ఆ పదం అడ్డుపెట్టుకొని వలసవాదం వచ్చిందని అన్నారు. తెలంగాణ భాషమీద, మాండలికం మీద, వ్యక్తిత్వం ఆహారం, ఆహార్యం మీద తెలుగుజాతి పదం అడ్డుపెట్టుకొని తీవ్రమైన దాడి జరిగిందని అన్నారు.ప్రాంతాలుగా విడిపోదాం తెలుగు జాతీగా కలిసుందాం అంటూ తెలంగాణ వాదులు మాట్లాడేది అర్థరహిత మని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విముక్తి పోరాటం అని జాగ్రత్త దీనిని గమనించాలని ముందుంది అసలు ప్రమాదం సమానత్వ ప్రాతిపదికన తెలంగాణ పునర్నిర్మాణం కావాలని దీనికి గాను ఆధిపత్య భావాజాలంతో సంపాదించుకున్న భూములు ప్రభుత్వ సహాయంతో ప్రేరణతో దురాక్రమణచేసిన సహజ సంపద ప్రజలకు చెందేలా పునర్నిర్మాణం జరుగాలని భౌగోళిక గీతలు కాదనిలెక్కలు తేలాని పునరుద్ఘాటించారు. దేశంలో ఒకే జాతి వుంటుంది. అది భారతజాతి, ఒకే పౌరసత్వం వుంటుంది. కానీ ఆంధ్ర, తమిళ, కర్నాటక పౌరులు, జాతి అంటూవుండదని, అవిభాజ్యమైన భారత దేశం ఎపుడైనా విభజన చేసుకొనే రాష్ట్రాలు మాత్రమే వుంటాయని ఇది విజ్ఞులు గుర్తించాలని కోరారు. ఆదిపతప్య భావాజాలం నుంచి పుట్టుకొచ్చిన భావాజాలం ‘తెలుగుజాతి’ పదబంధం అని ఆయన అన్నారు. భాషాభిమానం లేకపోతే మనిషికింద ఎవరిని లెక్కకట్టలేం.. భాషా దురభిమానం వుంటే మాత్రం వెర్రితనం వస్తుందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. తమిళ భాష తమిళ జాతి తమిళదేశీయులు అని చివరకు ఈ దేశం నుంచి విడిపోతామనే వరకు వెళ్లిందని దీనిని ఎవ్వరు కూడా ప్రోత్సహించవద్దని అన్నారు. ద్రవిడ ఉద్యమం ఫలితంగా రాజ్యాంగం ఏడో సవరణ చేసి పార్లమెంట్ అభ్యర్థులతో ప్రాదేశిక సమగ్రత గౌరవిస్తామని అఖండతను గౌరవిస్తామని ప్రమాణం చేసి ఎలక్ట్రో అఫెన్స్‌గా మార్చినారని గుర్తుచేశారు. 1980లో పరిశ్రమకాని విచిత్ర చిత్రపరిశ్రమ వల్ల తెలుగు వల్లభుడు, తెలుగుజాతిఐక్యత, ఆత్మగౌరవం నినాదం పుట్టుకొచ్చిందని చరిత్రగతిని వివరించారు. వలసవాద ఆదిపత్య భావాజాలంలో పడి తెలుగుజాతి అనే భ్రమలో వున్నామని తెలంగాణరచయితలు సోక్రెటీస్,కాళోజి స్పూర్తితో తెలుగుజాతి తాత్వికతపై ప్రశ్నించేలా రచనలు చేయాలని కోరారు. సోక్రటీసు విషం తాగుతావా? బోదనలు చేయడం, ప్రశ్నించడం మానుకుంటావా అని ఏథేన్స్ రాజ్యం ప్రశ్నిస్తే విషం తాగుతానని మాత్రమే చెప్పారని తెలుగు తల్లి మాటలోనే ముసలంవుందని కాల్పానిక భావనా అస్థిత్వంపై ప్రజలను రాజకీయ నాయకులను చైతన్యం చేయాలని కోరారు. తానురాజ్యాంగ పదువులు ఏన్నో నిర్వర్తించాని భారత సంవిదానం, ప్రాదేశిక సమగ్రత గౌరవిస్తానని మాత్రమే ప్రమాణంచేశామని రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తాను కాబట్టే నేను రాష్ట్ర విభజన కోరుకోవడం రాజ్యాంగం పరిధిలోని భావప్రకటనస్వేచ్చకిందకు వస్తుందని ఆయన చెప్పారు. సమావేశంలో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నలిమెల భాస్కర్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నగునూరి శేఖర్, సాహిత్య అకాడమీ కన్వీనర్ గోపి, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారయణ, జార్ఖండ్ జనసాంస్కృతిక మంచ్ అనల్ అంశుమన్, దాస్యం సేనాధిపతి, అన్నవరం దేవేందర్, బోయినపల్లి వెంకటరామారావు, పత్తిపాక మోహన్, సంకెపల్లి నాగేంద్రశర్మ, సంగవేని రవీంద్ర, సిఎన్ రెడ్డి, మచ్చ ప్రభాకర్, జూలురి గౌరీశంకర్, సూరేపల్లి సుజాత, జూకంటి జగన్నాథం, బూర్ల వెంకటేశ్వర్లు, గాజోజు నాగభూషణం పాల్గొన్నారు.



