Tuesday, 3 November 2026

బాబూ! తెలంగాణిస్తే చిచ్చుపెట్టినట్టా?!


విడగొట్టాలా? వద్దా?!
నీ సంగతేంటిది.. నిలదీసిన టీఆర్‌ఎస్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే చిచ్చుపెట్టి నట్టా అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఆదివారం స్థానిక తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను విడ గొట్టాలా వద్దా? అసలు నీ వైఖరి, నీ పార్టీ వైఖరి ఏమిటంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి కిరణ్‌, టీ డీపీ అధినేత చంద్రబా బు తోడు దొంగలని ఆయన ఆరోపించారు. ఇద్దరూ తెలంగాణను అడ్డుకోవ డానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రకటించి రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు అంటున్నారని, తెలంగాణపై బాబు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యాఖ్యలపై టీ టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆత్మగౌరవ యాత్ర సీమాంధ్రలో ఫలించకపోడంతో చంద్రబాబు ఢిల్లీవెళ్లి తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. రెండు ప్రాంతాల్లో చంద్రబాబు ఆటలు సాగవని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *