Wednesday, 4 November 2026

జాగృతి అంటేనే బతుకమ్మ : కవిత

నల్లగొండ : జాగృతి అంటేనే బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జీవన విధానాన్ని బతుకమ్మ ద్వారా వెలిగెత్తి చాటుతున్నామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంగారు బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆంధ్రా పాలనలో తెలంగాణ సంస్కృతి ,సాంప్రదాయాలు ,జీవన విద్వంసం జరిగిందని ఆమే పేర్కోన్నారు. వాటిని పునర్‌ నిర్మించడమే జాగృతి లక్ష్యమని ఆమె చెప్పారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం వనరులను రక్షించడం కోసం సుశిక్షితులైన సైనికులను తయారు చేశామని ఆమె తెలిపారు. జాగృతి అనుభంద సంస్ధలను కూడా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సామాజిక పరిస్థుతులను అంచనా వేస్తూ జాగృతి అన్ని విభాగాల కార్యకర్తలు చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *