చంచల్‌గూడ జైలునుంచి బయటకచ్చిన జగన్
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో అరెస్టై 16నెలల పాటు జైలులో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ మంగళవారం సాయంత్రం ఎట్టకేలకు బయటకొచ్చాడు. నిన్న బెయిల్ ఇచ్చిన సీబీఐ న్యాయస్థానం ఈరోజు జగన్ విడుదలకు చంచల్‌గూడలోని జైలుకు ఉత్తర్వులు జారీ చేసింది.వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలువద్దకు చేరుకుని జగన్‌కు స్వాగతం పలికారు.



