Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం వివక్ష

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం వివక్ష చూపుతుంది. సీమాంధ్రలో సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యోగులకు దసరా బోనస్‌ ఇవ్వలేం అని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనితో తెలంగాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్‌లు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ నెల 27న తెలంగాణ బస్‌ డిపోల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *