ప్రమాదవశాత్తు బస్సు కింద పడి విద్యార్థి మృతి
అమీర్‌పేట్ (హైదరాబాద్) :బస్సు దిగుతూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి అదే బస్సు కిందపడి మృతిచెందిన ఘటన ఎస్సార్‌నగర్ చౌరస్తాలో ఈరోజు ఉదయం జరిగింది. బాబునగర్‌కు చెందిన ఆకాశ్ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బోరబండ నుంచి కాచిగూడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రం కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



