Tuesday, 3 November 2026

ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌ ముగ్గురు వైద్యులకు మెమోలు

భువనగిరి (నల్గొండ) : నల్గొండ జిల్లా భువనగిరిలో 100 పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.రోగులకు 24గంటలు అందుబాటులో ఉండాలని డాక్టర్లను ఆదేశించారు.సంతకం పెట్టి విధుల్లో లేని ముగ్గురు వైద్యులకు మెమోలు జారీ చేశారు.పని తీరును మార్చుకోకుంటే చర్యలు తప్పవని వైద్యులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *