నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

హైదరాబాద్‌ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చందనాఖాన్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని వైఎస్సార్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని ,రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ కూడా పాల్గొంటారని ఆమె వెల్లడించారు.

తాజావార్తలు