ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం : రాష్ట్రంలోని వైద్య, దంత కళాశాలల్లో రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఎంబీబీఎస్ ,బీడీఎస్ సీట్లను భర్తీ చేయడానికి తుది విడత కౌన్సెలింగ్‌ను శుక్ర,శనివారాల్లో నిర్వహించనున్నారు.హైదరాబాద్ ఉస్మానియా దూర విద్యా కేంద్రంలో నిర్వహించే కౌన్సెలింగ్‌లో మూడు విశ్వ విద్యాలయాల పరిధిలో ఆరు ఎంబీబీఎస్,120 బీడీఎస్ సీట్లను అందుబాటులో ఉంచారు.ఎంసెట్ మెరిట్ ఆర్డర్ ప్రకారం ఒకటో ర్యాంకు నంచి 5000 ర్యాంకు అభ్యర్ధులు శుక్రవారం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రవేశాల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ సుబ్బారావు తెలిపారు.




