ప్రముఖ హీరో మహేష్‌బాబు ఇంట్లోకి ఆంగతకుడి చొరబాటు
హైదరాబాద్ : ప్రముఖ సినీ హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఆగంతకుడు చొరబడి దొంగతనానికి యత్నించాడు.ఈ సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -81లో హీరో మహేష్‌బాబు నివాసం ఉంది.బుధవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో మహేష్‌బాబు ఇంటి ప్రహరీగోడ దూకిన ఆగంతకుడు సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంటి వెనకాల కిటికి అద్దాలు పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. నేరుగా మహేష్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్ వద్దకు చేరుకుని దొంగతనానికి యత్నించాడు.



