Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను కించపర్చిన వాళ్ల సినిమాలనే అడ్డుకుంటున్నాం : పిడమర్తి రవి

హైదరాబాద్‌ : సీమాంధ్ర సినీ పరిశ్రమపై తమకెలాంటి కోపంలేదని ,కేవలం తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన వాళ్ల సినిమాలను మాత్రమే అడ్డుకుంటున్నామని తెలంగాణ విద్యార్ధి జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము తెలంగాణ అనగానే సీమాంధ్రులు సమైక్యాంధ్ర అంటున్నారని తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని ఉద్యమాల గురించి మాట్లాడని అక్కినేని ,రామానాయుడు కుటుంబాల సినిమాలను అడ్డుకోవడం లేదని కేవలం తెలంగాణ ఉద్యమం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ల సినిమాలను మాత్రమే అడ్డుకుంటున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *