Tuesday, 3 November 2026

ఆలయం కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం

కార్ఖానా (హైదరాబాద్‌) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంటోన్మెంట్‌ మడ్‌పోర్డు మైదానంలో చెట్టుకూలి మునీశ్వర ఆలయంపై పడడంతో ఆలయం ద్వంసమైంది. దీంతో స్థానికులు ఆలయ పునర్‌నిర్మాణ పనులు చేపట్టారు. ఈరోజు ఉదయం కంటోన్మెంట్‌ బోర్డు సిబ్బంది ఆలయాన్ని కూల్చి వేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.వీరికి భాజపా, తెరాసలు జతకలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు వివరణ ఇచ్చేంతవరకు కదలమని ఆందోళనకారులు ఆలయం వద్దే బైఠాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *