ఒక్కనిమిషం కూడా సీఎంగా ఉండే అర్హత లేదు

– కిరణ్ ఇక దిగిపో
– హరీష్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 27(జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సమైక్యవాదిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. దిగ్విజయ్‌సింగ్‌ను ధిక్కరించడమంటే అధిష్టానాన్ని ధిక్కరించడమేనని ఆయన విమర్శించారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం పదవిలో ఉండే అర్హతను కిరణ్ కోల్పోయాడని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే నీళ్ల దోపిడి జరగదని, జరగనీయరని సీఎం బాహాటంగానే అంగీకరించారని ఆయన తెలిపారు. కిరణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.



