Tuesday, 3 November 2026

చెత్తకుప్పలో పసికందు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ పట్టణ కేంద్రంలోని ప్రగతినగర్‌ కాలనీలో అప్పుడే పుట్టిన ఆడశిశువును చెత్తకుప్పలో వదిలివెళ్లిన ఘటన స్థానికుల్ని కలచివేసింది.రోజు వారీ చెత్తను తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బంది చెత్త తీస్తుండగా ఆడ శిశువు కనిపించింది. దీంతో వారు పోలీసులు,మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు.స్థానికులు కూడా భారీగా అక్కడికి చేరుకుని వచ్చి శిశువుని చూసి చలించిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *