డీజీపీ చాప్టర్ క్లోజ్

హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్ : డీజీపీ దినేష్‌రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్ రెడ్డి వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు ఆదివారం కొట్టివేసింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ దినేశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనల అనంతరం సాయంత్రం దాన్ని కొట్టివేసింది. రేపటితో ఆయన పదవీకాలం ముగియనుంది. కాగా డీజీపీ పదవీ కాలాన్ని పొడగించవద్దని తెలంగాణ న్యాయవాదులు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు వేశారు.



