జగన్‌ తెలంగాణపై జరిగిన దోపిడిని ఒప్పుకున్నడు :కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ జలాల దోపిడీ జరిగిన విషయాన్ని మొన్న సీఎం కిరణ్‌ ఒప్పుకుంటే ఈ రోజు జగన్‌ ఒప్పుకున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు.నదీ జలాల విషయంలో అవగాహన పెంచుకోవాలని జగన్‌కు కేటీఆర్‌ సూచించారు.ఇండియా, పాకిస్తాన్‌లు 5నదులను పంచుకోవడం లేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టిన నాడే తెలంగాణ అన్న పదం ఉచ్చరించే నైతిక హక్కు జగన్‌ కోల్పోయిండని కేటీఆర్‌ అన్నారు. జగన్‌ను నమ్ముకుని మంత్రి పదవి వదులుకుని వచ్చిన కొండా సురేఖకు అన్యాయం చేసిన ఆయన తెలంగాణకు న్యాయం చేస్తననడం ఒక పెద్ద జోక్‌ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎవరు కూడా వైఎస్సార్‌ వీసా మాటలను, షర్మిల హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన విషయాన్ని మర్చిపోలేదని కేటీఆర్‌ గుర్తు చేశారు.