Monday, 2 November 2026

సీఎంగా ఇష్టం లేకుంటే కిరణ్‌ రాజీనామా చేయొచ్చు

ఢిల్లీ : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షీత్‌ తెలిపారు.తెలంగాణ విభజన అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై వెనక్కి పోదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయాలనుకుంటే అది ఆయన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియమించిన ఆంటోని కమిటీ సిఫార్సులను తెలంగాణ బిల్లులో పరిగణలోకి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *