Monday, 2 November 2026

తెలంగాణలో గుట్టలే మిగిలాయి

ఏఐకేఎంఎస్‌ సమావేశంలో చుక్కా రామయ్య
హైదరాబాద్‌ :అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించి ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు కట్టబెట్టిందని, తెలంగాణ జిల్లాల్లో గుట్టలు తప్ప మరేమీ మిగలలేదని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ వనరులను ఆంధ్రా పాలకులు దోచుకున్నారని విమర్శించారు. మంగళవారం హైరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) రాష్ట్ర కార్యదర్శి సమావేశంలో ఆయన ప్రసంగించారు. దివంగత నేత వైఎస్‌ బయ్యారం గనులను తన అల్లుడికి ధారాదత్తం చేశాడని మండిపడ్డారు. ఈ కేటాయింపులపై స్థానిక ప్రజలు తిరుగుబాటు చేస్తే అక్కడికి 600 మంది కడప గుండాలను పంపి వారిని భయవూబాంతులకు గురి చేసి చివరకు వనరుల్ని అన్యాయంగా అక్రమించుకున్నాడన్నారు. ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు టాన్యా మాట్లాడుతూ భూ సంస్కరణలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూనే రాష్ట్ర వ్యాప్తంగా మిగులు భూముల కోసం అనేక ఆందోళనలు నిర్వహించామన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను ప్రభుత్వం చెత్త బుట్టలో వేసిందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టాపాటి వెంకట్‌ కోశాధికారి మండల వెంకన్న, కార్యవర్గ సభ్యులు పైలా చంద్రమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *