హైదరాబాద్ : తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకే జగన్‌తోపాటు కొందరు పెట్టుబడిదారులు సమైక్యవాదం అంటున్నారని టీ. జేఏసీ చైర్మన్ కోదండరాం సీమాంధ్రులపై ద్వజమెత్తారు. సమైక్యవాదం ముసుగులో వైసీపీ సభలు పెట్టి తెలంగాణ హక్కులను హరించాలని చూస్తే సహించమని ఆయన తేల్చిచెప్పారు.సమైక్యవాదులు ఇప్పటికైనా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా శాంతియుతంగా గాంధేయమార్గంలో తెలంగాణ కోసం పోరాడుతున్నామని ఆయన తెలిపారు.




