7న బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక

కాకినాడ,జూలై 5 : బ్యూటీపార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఫెయిర్‌నెస్‌ రిపోర్టు కార్డులు ఇవ్వనున్నట్టు ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ మీడియా పర్సన్‌ ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు మన రాష్ట్రంలోకి ప్రవేశించే ఎక్స్‌పర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించాలని ఆయన పేర్కొన్నారు. జూలై 7న రాష్ట్రంలోకి వచ్చే ఈ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌లో ప్రయాణిస్తుందని అన్నారు. ఎక్స్‌ప్రెస్‌ను తిలకించిన ప్రతి ఒక్కరికి ఫెయిర్‌నెస్‌ రిపోర్టు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కస్టమైజ్డ్‌  విలాసవంతమైన ఎక్స్‌ప్రెస్‌ బస్సులో బ్యూటీ అడ్వయిజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.