సీమాంధ్ర ఉపాధ్యాయ, విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం

అదే బాటలో ఏపీఎన్‌జీవో, ఆర్టీసీ కార్మికులు
హైదరాబాద్, అక్టోబర్ 10 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించేందుకు సీమాంధ్ర విద్యు త్ ఉద్యోగ సంఘాలు అంగీకరించా యి. తుఫాను కారణంగా తాత్కాలి కంగా సమ్మె విరమిస్తున్నట్లు సీ మాంధ్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కిరణ ్‌కుమార్‌రెడ్డి గురువారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తుఫాను కారణంగా సమ్మె విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఉద్యోగులు అంగీకరించారు. తాత్కాలికంగా సమ్మె విరమించనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు సీఎం కిరణ్‌తో విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశమయ్యారు. సమ్మె విరమణపై ముమ్మరంగా చర్చించారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన ప్రకటన వస్తేనే సమ్మె విరమిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. విభజన ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయించాలని, లేదంటే స్పష్టమైన హావిూ ఇప్పించాలని కోరారు. అయితే, ప్రస్తుత పరిస్తితుల నేపథ్యంలో సమ్మె విరమించాలని ప్రభుత్వం ఉద్యోగులను కోరింది. విభజన ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్లకుండా తీవ్ర ఒత్తిడి తెస్తున్నామని తెలిపింది. తెలంగాణను అడ్డుకొనే బాధ్యత తమదని తీర్మానాన్ని కచ్చితంగా ఓడిస్తామని, ఆందోళన విరమించాలని ముఖ్యమంత్రి ఉద్యోగులను కోరారు. ‘రాష్ట్ర విభజన జరగకుండా శక్తిమేరకు కృషి చేస్తున్నాం అన్ని పార్టీల సహకారంతో తీర్మానాన్ని ఓడిస్తాం. నేను పదవిలో ఉన్నంత వరకూ తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకుంటానని హామీ ఇస్తున్నా.. మీరు సమ్మె విరమించండి. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే కొనసాగితే వారి నుంచి ప్రతిఘటన తప్పదు.. మరోవైపు, తుఫాను ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తే తీవ్ర విమర్శలు తప్పవు. అందుకే సమ్మె విరమించండి’ అని కిరణ్ ఉద్యోగులను కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఉద్యోగ నేతలు సమ్మె విరమించేందుకు అంగీకరించారు. అయితే, ఇంతకాలం సమ్మె కొనసాగించి, స్పష్టమైన ప్రకటన రాకుండా విరమించడం సరికాదని ఉద్యోగ సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. హావిూ లేకుండా సమ్మె విరమించడం ఎలా? అన్న దానిపై మల్లగుల్లాలు పడ్డారు. అయితే, తుఫానును కారణంగా చూపి సమ్మె విరమించాలని సీఎం కిరణ్ సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగ నేతలు తుఫాను కారణంగా సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు మేరకు తమ సమ్మె తాత్కాలిక వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ జేఏసీ నేత సాయిబాబా తెలిపారు. తుఫాను, పండుగల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఉద్యోగులు అందరూ తప్పకుండా విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే, విభజనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. సమ్మె విరమించేది లేదని, తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. 30 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 15 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు సమ్మెకు సహకరించారని.. ప్రజలు విద్యార్థులు అందరూ సమ్మె తాలూకు కష్టాలను సహనంతో భరించినందుకు అందరికీ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. 23 జిల్లాల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారన్నారు. తమ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగివచ్చిందని తెలిపారు. తమ డిమాండ్లను కేంద్రానికి నివేదిస్తానని సీఎం హావిూ ఇచ్చారన్నారు. తమ డిమాండ్‌ను కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నామని, అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమన్నారు.



