ఏపీ భవన్‌ ఆంధ్ర భవన్‌ ఎట్లయితది


సీమాంధ్ర కబ్జాకోరు ఖాళీ కర్‌ : దేవీప్రసాద్‌
కరీంనగర్‌, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) :
ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆంధ్ర భవన్‌ ఎట్లయితదని టీ ఎన్‌జీవోల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ప్రశ్నించారు. సీమాంధ్ర కబ్జాకోరు లు ఖాళీ చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చే వాటిని పరి ష్కరించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నియమించిన  గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌కు కాలపరిమితి విధించాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఇంతకాలం హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను ఏర్పాటుచేస్తామని చెప్పుతూ వచ్చి సడన్‌గా హైదరాబాద్‌పై కొన్ని పరిమితులను కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పడం దుర్మార్గమే అవుతుందన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టినా కూడా తెలంగాణ  సమాజం ఒప్పుకోదని, త్వరలోనే ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని దేవిప్రసాద్‌ హెచ్చరించారు. కేంద్రప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పాలనకు పక్షపాతం వచ్చిందన్నారు. డిజిపి సిఎంపై చేసిన వ్యాఖ్యలపై కచ్చితంగా పోరాటం చేస్తామన్నారు. 10వ పే రివిజన్‌ కమిషన్‌ కోసం నవంబర్‌ నుంచి పోరాటం చేస్తామన్నారు. ఆంధ్రా తెలంగాణకు కూడా సిఎంను అని గుర్తుం చుకోవాలని ఆయన హెచ్చరించారు. తమ ఓపికను చేతగానితనంగా చూడొద్దన్నారు. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు నేడు ఉన్మాదుల్లా మారారని ఆరోపించారు. తెలంగాణ సాధనకోసం తాము ఎన్నో ఏళ్ల పాటు పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఎక్కడకూడా ఇలాంటి విద్వంసాలు చోటు చేసుకోలేదని గుర్తు చేసారు. న్యూడిల్లీలో చంద్రబాబు దీక్ష చేయడం ముమ్మాటికి  తెలంగాణకు వ్యతిరేకమే అవుతుందన్నారు. ఇప్పటి కైనా కేంద్ర ప్రబుత్వం తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

తాజావార్తలు