మలాలకు ఈయూ ప్రతిష్టాత్మక అవార్డు


లండన్‌, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) :
పాకిస్థాన్‌కు చెందిన బా లల హక్కుల కార్యకర్త మలాల యూసుఫ్‌జాయ్‌ ప్రతిష్టాత్మక ఐరోపా పా ర్లమెంట్‌ (ఈయూ) అ వార్డుకు ఎంపికైంది. తా లిబాన్లకు ఎదురొడ్డి బా లికల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటానికి గా ను ఈయూలో ఉన్నత స్థాయి అవార్డుగా భావిం చే ‘సఖరోవ్‌’ మానవ హక్కుల నపురస్కారాన్ని అందజేయనున్నారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్‌ ష్లూజ్‌ గురువారం లండన్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. మలాలలోని అద్భుత సామర్థ్యాన్ని ఐరోపా పార్లమెంట్‌ గుర్తించిందని అన్నారు. ‘పిల్లలందరికీ చదువుకొనే హక్కు ఉందని, అది వారికి దక్కాల్సిందేనని మలాల ధైర్యంగా పోరాడిందని ఆయన కొనియాడారు. పాకిస్థాన్‌లో బాలల హక్కుల కోసం పోరాడుతున్న మలాలపై గతేడాది తాలిబన్లు దాడి చేశారు. మరణం అంచులదాకా వెళ్లిన మలాల సంపూర్ణ ఆరోగ్యంతో కొద్దికాలం క్రితం ఆస్పత్రిని నుంచి డిశ్చార్జి అయింది. సుఖరోవ్‌ అవార్డు కింద మలాలకు 65 వేల డాలర్లు (రూ.40 లక్షలు) అందజేయనున్నారు. ఆమె ప్రస్తుతం నోబెల్‌ శాంతి బహుమతి రేసులోనూ ఉన్నారు.

తాజావార్తలు