Tuesday, 3 November 2026

కేబినెట్‌ నోట్‌లో మార్పు లేదు


యూటీ చేస్తే కొత్త సమస్యలు : పీటీఐ
సీమాంధ్రకు, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ
గులాంనబీ ఆజాద్‌ – వైద్య విద్య, ఉపాధి
జైరాం రమేశ్‌ – వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీ
వీరప్ప మొయిలీ – న్యాయ పరమైన అంశాలు
చిదంబరం – ఆర్థికం, షిండేకు శాంతిభద్రతలు
ఆంటోనీ – సరిహద్దులు, రక్షణ, నియోజకవర్గాల కేటాయింపు
మంత్రుల బృందం తొలి సమావేశం
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్‌ తెచ్చిన నోట్‌లో ఎలాంటి మార్పులు లేవని మంత్రుల బృందం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని మంత్రుల బృందం చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లుగా పీటీఐ ప్రత్యేక కథనం వెలువరించింది. సీమాంధ్ర ప్రాంతానికి, అక్కడ కొత్త రాజధాని ఏర్పాటు కోసం భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రుల బృందం సభ్యులకు ఆంధ్రప్రదేశ్‌ విభజనలో తీసుకోవాల్సిన కీలక అంశాల బాధ్యతలను కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అప్పగించారు. ఆయా అంశాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా విభజన ప్రక్రియ పూర్తయ్యేలా సదరు మంత్రులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గులాంనబీ ఆజాద్‌కు వైద్య విద్య, ఉపాధి రంగాలు, జైరాం రమేశ్‌కు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీ, వీరప్ప మొయిలీకి న్యాయ పరమైన అంశాలు, చిదంబరానికి ఆర్థిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *