Wednesday, 4 November 2026

తెలంగాణ విధ్యార్థి సైన్యం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విధ్యార్ధి సదస్సులు

హైదరాబాద్‌ : సంపూర్ణ తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విధ్యార్ధి సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ వెల్లడించారు. ఈనెల 25న కరీంనగర్‌, 26న ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల, 28న నల్లగొండ, 29న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 30న వరంగల్‌ ,31న వికారాబాద్‌, వచ్చే నెల 1న మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో విద్యార్ధి సదస్సులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు, టీ కాంగ్రెస్‌ నేతలు విజయోత్సవ సభలు పెట్టకుండా సంపూర్ణ తెలంగాణ కోసం ఢిల్లీ వెళ్లి కొట్లాడాలని సూచించారు. సీఎం కిరణ్‌ సీమాంధ్ర ఉద్యమం నడుపుతుంటే తెలంగాణ మంత్రులు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *