హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలిపితే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రెండవ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆయన తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన సంస్థ టీఎంయూ అని ఆయన కొనియాడారు. ప్రారంభించిన 13నెలల్లోనే టీఎంయూ గుర్తింపు పొందిందని తెలిపారు.జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలపాలని కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు.దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఏ కార్మిక సంఘం కూడా ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోదని చెప్పారు.
ఆర్టీసీని గ్రేటర్‌లో విలీనం చేస్తే సహించేదిలేదు : హరీష్‌రావు





