Tuesday, 3 November 2026

తెలంగాణ సునామీ లాంటిది ,ఆపడం ఎవరితరం కాదు : సారయ్య

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమాన్ని తుపాన్‌తో పోల్చడం దురదృష్టకరమని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ అంశం సునామీ లాంటిదని ,ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరకి లేదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణను అడ్డుకుంటామని ప్రకటించడం దుర్మార్గమన్నారు. జీవోఎంకు తాము కూడా నివేదిక అందజేస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లోపే తెలంగాణ ఏర్పడతదని ఒక వేళ తెలంగాణ అంశంపై వెనక్కిపోతే టీ ప్రజాప్రతినిధులెవరు కాంగ్రెస్‌ తరపున పోటీ చేయరని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *