నెల్లూరు : రావూరు మండలం శానాయపాలెంలో ఓ ఉన్మాది గొడ్డలితో వీరంగం సృష్టించాడు. గొడ్డలితో ముగ్గురిపై దారుణంగా దాడి చేశారు. ఉన్మాది దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. కండలేరు పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.




