Tuesday, 3 November 2026

టీడీపీలో చేరనున్న పవన్‌కళ్యాణ్‌ ?జోరుగా ఊపందుకున్న వార్తలు

హైదరాబాద్‌ : నటుడు పవన్‌కళ్యాణ్‌ టీడీపీలోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. టీడీపీలోకి దారి ఉందో, లేదో పవన్‌నే అడగాలని టీడీపీ నేతలు చమత్కారాలు విసురుతున్నారు. పవన్‌, నాగబాబు టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …పవన్‌కళ్యాణ్‌కు వ్యక్తిగతంగా మంచివాడనే పేరుందని, పది మందికి సాయం చేసే గుణం ఆయనకు ఉందని తాను విన్నానని చెప్పారు. మంచి వ్యక్తులు ప్రజా జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన అన్నారు. అవినీతిపరులకు తప్ప మంచి వ్యక్తులు ఎవరైనా టీడీపీలోకి వస్తే స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *