హైదరాబాద్ : డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఇవాళ కలిశారు.వృత్తి విద్యా కళాశాలలకు అదనపు నిధులను కేటాయించాలని దామోదరకు ఈటెల విజ్ఞప్తి చేశారు. దామోదరను కలిసిన అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. వృత్తి విద్యా కళాశాలల్లో తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ లాగిన్ ఓపెన్ చేసి ఇంటర్ పారామెడికల్ విద్యార్ధులను ఎన్‌రోల్ చేసుకోవాలని ఆయన కోరారు. ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంచాలని డిమాండ్ చేసుకోవాలని ఆయన కోరారు. పారామెడికల్ కోర్సులు కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 1,245 కళాశాలలు మూతపడుతాయని తెలిపారు. వేల సంఖ్యలో టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్తారని తెలిపారు.




