హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.సచివాలయం వద్ద అరెస్టైన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం సచివాలయంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.




