హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మహిళా సంఘాల ఆద్వర్యలో విద్యార్థినులు ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్జీ స్టేడియం ,బషీర్‌బాగ్ ప్రాంతాలలో విద్యార్ధినులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యాచారాలు ,మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినదించారు. పెచ్చుమీరుతున్న అశ్లీల సంస్కృతిని ముందుగా నిలువరించాలని డిమాండ్ చేశారు. ఎన్ని చట్టాలు చేసిన ,మహిళలపై జరుగుతున్న నేరాలను నిలువరించలేకపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నానాటికి దిగజారిపోతున్న సంస్కృతి విలువలను పరిరక్షించాలని వారు కోరారు.




