హైదరాబాద్ : సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటారనే కారణంతో నగరంలోని తెలంగాణవాదులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ ,వనస్థలిపురం, హయత్‌నగర్‌లో నల్లకుంట తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేపట్టిన ఓయూ జేఏసీ విద్యార్ధులను ఎన్‌సీసీ యాదయ్య గేటు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ గేటు ముందు ముళ్లకంచె, బారీకేడ్లతో పహారా ఏర్పాటు చేశారు.విద్యార్ధులు బయటకు రావొద్దంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు.




