Monday, 2 November 2026

హెల్త్‌ కార్డులపై ఉద్యోగసంఘాలతో ముగిసిన సీఎస్‌ చర్చలు

హైదరాబాద్‌ : హెల్త్‌ కార్డులపై ఉద్యోగసంఘాలతో సీఎస్‌ జరిపిన చర్చలు ముగిశాయి. మున్సిపల్‌ , ఎయిడెడ్‌ ,రెసిరెన్షియల్‌ ఉద్యోగులను హెల్త్‌కార్డులకు లబ్దిదారులుగా వర్తింపజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: పీకే మహంతిని ఉద్యోగసంఘాలు కోరాయి. అట్లాగే కుటుంబంలో ఎంతమందికి అనే విషయంలో సీలింగ్‌ ఎత్తివేయాలని సీఎస్‌ను ఉద్యోగసంఘాలకు హామి ఇచ్చారు. సీలింగ్‌ ఎత్తివేయకుంటే హెల్త్‌కార్డులకు అంగీకరించేదిలేదని ,దీపావళిలోగానే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగసంఘాల నేతలు దేవిప్రసాద్‌ ,శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై సాయంత్రం అధికారులతో సీఎస్‌ భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *