వీలైనంత త్వరలో తెలంగాణ
రాజకీయ పార్టీలకు హోంశాఖ లేఖలు
విధివిధానాలపై ఐదులోపు అభిప్రాయం చెప్పండి
కేంద్ర హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్ 31 (జనంసాక్షి) :
వీలైనంత త్వరగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. సమయం తక్కు వగా ఉన్నందున వీలైనంత త్వరగా తెలంగాణ ప్రక్రి య ను పూర్తి చేస్తామని కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమ య్యారు. రాష్ట్ర విభజన, తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖ తదితర అంశాలపై ప్రణబ్‌కు వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై అనుసరిస్తున్న ప్రక్రియను వివరించారు. భేటీ ముగిసిన అనంతరం షిండే విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ¬ంశాఖ లేఖలు రాసిందని తెలిపారు. మంత్రుల బృందం (జీఓఎం) విధివిధానాలపై అభిప్రాయాలు చెప్పామని కోరామన్నారు. అఖిలపక్ష భేటీకి ఇంకా తేదీలు ఖరారు కాలేదని.. పార్టీల అభిప్రాయం అందాక ఖరారు చేస్తామన్నారు. సీఎం కిరణ్ రాసిన లేఖలపై ప్రశ్నించగా ఆయన సూటిగా స్పందించలేదు. అయితే, ముఖ్యమంత్రి రాసిన లేఖలపై తాను రాష్ట్రపతికి వివరణ ఇవ్వలేదని చెప్పారు. ఆ అవసరం కూడా లేదన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందం విధివిధానాలపై అభిప్రాయాలు తెలిపాలని కేంద్ర ¬ం శాఖ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు చెప్పారు. నవంబర్ 5 లోపు అభిప్రాయాలు తెలపాలని కోరామన్నారు. ఈ మేరకు కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి గోస్వామి ఎనిమిది పార్టీలకు గురువారం లేఖలు పంపించారు. తెలంగాణపై కేంద్ర ¬ం ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన జీఎంఓ విధివిధానాలపై అభిప్రాయాలు పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 7వ తేదీన మంత్రుల బృందం సమావేశం కానున్నందున.. ఆలోపే అభిప్రాయాలు పంపాలని కోరింది. సమయం తక్కువగా ఉన్నందున కేంద్ర ¬ం శాఖ రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విభజనపై నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు, విభజనలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేసేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం అమలు చేసింది. జీఓఎం విధివిధానాలపై అభిప్రాయాలు కోరడంతో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బుధవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో వ్యూహం ఖరారైంది. ఆ వెంటనే ¬ం మంత్రి షిండే ఓ ప్రకటన చేశారు. జీఓఎం విధివిధానాలపై పార్టీల అభిప్రాయం కోరతామని, ఆ తర్వాత అఖిలపక్షం నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అభిప్రాయాలు తెలపాలని ¬ం శాఖ గురువారం ఆయా పార్టీలకు లేఖలు పంపింది.