హైదరాబాద్ : తెలంగాణను సీమాంధ్రతో కలిపిన నవంబర్ ఒకటో తేదిన బ్లాక్ డేగా పాటించాలని తెలంగాణ జేఏసీ ,తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించాయి. తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ధూపాల దగ్గర అమరులకు నివాళులర్పించి నిరసన జెండాలు ఎగురవేస్తారు. శుక్రవారం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద టీ జేఏసీ చైర్మన్ కోదండరాం , ఉద్యోగ సంఘాల నేతలు ,శ్రీనివాస్ గౌడ్ ,దేవిప్రసాద్ , విఠల్ , పిట్టల రవీందర్ ,అద్దంకి దయాకర్ , ఆద్వర్యలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.




