హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అంశంపై అన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనక్కి వెళ్లదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ మరోమారు స్షస్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ముందుకే వెళ్తామని చెప్పారు. ఈ నెలాఖరులోగా శాసనసభకు తెలంగాణ బిల్లు వస్తుందని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా వారి కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి విధేయులే అని అన్నారు. ముఖ్యమంత్రికి తన అభిప్రాకయం వెల్లడించే హక్కు ఉంటుందని …. అభిప్రాయ భేదాలున్నప్పటికి సీఎ వ్యతిరేకంగా వెళ్లరని చెప్పుకొచ్చారు.నేటి సమన్వయ సమావేశం పార్టీ నేతలను సమన్వయ పరిచేందుకు ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి మార్పు అజెండా కాదని స్పష్టం చేశారు.




