సీడబ్ల్యూసీ నిర్ణయమే విభజనకు దిక్సూచీ
కిరణ్ తెలంగాణను ఆమోదించారు
కేంద్ర నిర్ణయానికి కట్టుబడతాడు
ఆంటోనీ కమిటీ రిపోర్ట్ జీవోఎంకు వెళ్లదు
మేడం పరిశీలించాకే కమిటీకి.. : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, నవంబర్ 8 (జనంసాక్షి) :
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ విభజనకు దిక్సూచీ అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారని వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లూ తాను సమైక్యవాదినని జబ్బలు చరుచుకున్న కిరణ్ వాదన అంతా ఢొల్లేనని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర అంశంపై అన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా కాంగ్రెస్ మాత్రం వెనక్కు వెళ్లదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామని పునరుద్ఘా టించారు. శుక్రవారం ఉదయం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌కు విశ్వాసపాత్రుడని, ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ కోసం పని చేశారని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆయన ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని వెల్లడించారు. తెలంగాణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని దిగ్విజయ్ పునరుద్ఘాటించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. విభజనపై ఇతర పార్టీలు వెనక్కు వెళ్లినా కాంగ్రెస్ వెనక్కు వెళ్లదని తెలిపారు. తమ పార్టీ మిగతా పార్టీల్లా యూ టర్న్ తీసుకొనే పార్టీ కాదని తేల్చి చెప్పారు. శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ సమన్వయ భేటీకి ఎలాంటి అజెండా లేదని తెలిపారు. ముఖ్యమంత్రి మార్పుపై విలేకరులు దిగ్విజయ్‌ను ప్రశ్నించగా ఆయన కొట్టిపడేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సీఎం పదవి నుంచి కిరణ్‌ను మార్చబోమని, ఆయన కాంగ్రెస్‌కు విధేయడుని చెప్పారు. సీఎం కిరణ్‌కు తన అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంటుందుని.. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ సీఎం వ్యతిరేకంగా వెళ్లరని తెలిపారు. విభజనపై కిరణ్‌కు అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమేనని అయితే, హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించరని పేర్కొన్నారు. సీఎంను మార్చడం కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఎజెండా కాదని.. అందరిలో సమన్వయం సాధించడమే కమిటీ ఎజెండా అని వివరించారు. కిరణ్ ధిక్కార శైలితో చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా ముఖ్యమంత్రికి ఏమైనా మాట్లాడే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. కిరణ్ ఏమైనా చెప్పుకొనే అవకాశం ఉందని, కానీ అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని చెప్పారు. ఏదేమైనా చివరకు సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సీమాంధ్రలోని సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర మంత్రుల బృందం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీకి బిల్లు వస్తుందా? తీర్మానం వస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. తీర్మానం రాదని, ముసాయిదా బిల్లు మాత్రమే వస్తుందన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వస్తుందని ప్రశ్నించగా నవంబర్ ఆఖరు లోగా వస్తుందని బదులిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై వస్తున్న వార్తలపై దిగ్విజయ్ స్పందించారు. ఆ అంశాన్ని కేంద్ర మంత్రుల బృందం చర్చిస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ, సీపీఎం జీవోఎంకు నివేదికలు ఇవ్వకుండా ఉండడం ద్వారా సీమాంధ్ర ప్రజల సమస్యలను చెప్పే అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు. ఆకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ జీవోఎంకు నివేదిక ఇవ్వబోదని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పరిశీలించాకే మంత్రుల బృందం వద్దకు వెళ్తుందని చెప్పారు.