సఫిల్‌గూఢ (హైదరాబాద్ ) : సఫిల్‌గూడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానిక వినాయక్ నగర్‌లో నివాసముంటున్న సి.వెంటేష్ (35), ఎం.,శేఖర్ ( 40) లు రైలు కిందనుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. శేఖర్ రైల్వే ఉద్యోగి కాగా , వెంకటేష్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. వీరు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.




