హైదరాబాద్ : నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం …మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావం మన దేశంపై ఏమాత్రం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో24 గంటల్లో మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల అండమాన్ నికోబార్ దీవుల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం అవకాశం ఉంది.




