Tuesday, 3 November 2026

ఆంటోనీ కమిటీ నివేదిక చెల్లదు : ఎంపీ వివేక్‌

హైదరాబాద్‌ : మంత్రుల కమిటీ కి ఇచ్చిన ఆంటోని కమిటీ నివేదిక రాజ్యాంగ వ్యతిరేకమని దాన్ని అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్‌ నేత ,పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ఆదిలాబాద్‌ పర్యటనలో ఉన్న వివేక్‌ ఆంటోని నివేదికను తప్పు పట్టారు. సీమాంధ్రలో 12 మెడికల్‌ కాలేజీలు ఉంటే తెలంగాణలో 4 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని ,తెలంగాణలోని మెడికల్‌ సీట్ల సీమాంధ్రులకు కేటాయిస్తే ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణానది ద్వారా 144 టీఎంసీల బదులు 364 టీఎంసీల నీటిని తెలంగాణకే కేటాయించాలనన్నారు. రాష్ట్రపతిని కలిసినపుడు పంట నష్టం ఇన్‌పుట్‌ సబ్సీడి , నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు ఎంపీ వివేక్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *