కాప్రా : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కాప్రా పట్టణ వికలాంగుల సమాఖ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వికలాంగులలో 50 మంది ఫించన్లు మంజూరయ్యాయి. ఫించన్లు పొందిన వారు గుర్తింపు కార్డు, ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకొచ్చి డబ్బు బ్యాంకులో జమ చేయించుకోవాలని అధికారులు సూచించారు. అర్హులకు పించన్లు మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు.




