Tuesday, 3 November 2026

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కాప్రా : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై సోమవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *