Tuesday, 3 November 2026

అదృశ్యమైన యువకుడు దారుణ హత్య

జిన్నారం : ఐడీఏ బోల్లారం శివారు ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కన ఓ యువకుడు హత్యకు గురైన ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. హత్యకు గురైన యువకుడు పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌ వీఆర్వో మల్లేశం కుమారుడు అనిల్‌ కుమార్‌ (19) గా పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *