హైదరాబాద్ : ఏడుగురు ఐసీఎస్ అధికారులను ఇదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వలు జారీ చేసింది. పార్వతీపురం ఓఎస్డీగా కోయ ప్రవీణ్, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా భాస్కర్ భూషణ్, వరంగల్ గ్రామీణ అదనపు ఎస్పీగా అంబర్ కిశోర్‌జా, నల్లగొండ జిల్లా ఎస్పీగా రామరాజేశ్వరిలను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వల్లో పేర్కొంది. అయితే, మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు డి.వి.శ్రీనివాసరావు, వి.భాస్కరరావు, వై.సాయి శేఖర్‌లకు ఇంకా పోస్టింగులు ఖరారు కాలేదు.




