హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జీవోఎం, పార్టీ ముఖ్యనేతలను కలిసి తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఆంటోని కమిటీ సిఫార్సల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవాటిని ఉపసంహరించుకోవాలని జీవోఎంను కలిసి కోరనున్నట్లు మంత్రి జానారెడ్డి తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కట్టుబడాలని జీవోఎంకు మరోసారి స్పష్టం చేయునున్నట్లు చెప్పారు.




