Tuesday, 3 November 2026

ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించిన బ్యాగ్‌

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ కలకలం రేపింది. డిపార్చర్‌ వద్ద గుర్తు తెలియని బ్యాగ్‌ను గుర్తించిన సి.ఐ.ఎస్‌.ఎఫ్‌ బలగాలు డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయి. అయితే బ్యాగ్‌ను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది అందులో బట్టలతో పాటు పచ్చళ్ల బాటిళ్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *